నిన్ను నేను మరచిపోయా ...
వేసవి సాయంత్రపు చిరుగాలిలో
మల్లెపూలు, పాండ్స్ పౌడర్ వాసన కలిసిన 
కొత్త సౌరభం నిన్ను గుర్తుకు తేలేదు..
సిరిచాపమీద కూర్చొని
చిరుతిండి తింటూ వర్షం చినుకులు వింటూ
చలం కధ చదివేటప్పుడు నువ్వు గుర్తురావు. ..
ధనుర్మాసపు సాయంసంధ్య
చలి గాలిలో తేలివచ్చే ఎదో వీణానాదం
నిన్ను అస్సలు గుర్తుచేయదు.
 నాకు బాగా గుర్తు... నిన్ను నేను మరిచిపోయానని.


No comments: