ఉదయం .. సాయంత్రం ..
రెండు సంధ్యలు. 
ఒక క్షణంలో ఒకేలాగా అనిపిస్తాయి.
ఆ క్షణం గడిస్తేకాని తెలియదు
అది ఉదయమో సాయంత్రమో.
మనం కూడా అలాగే వున్నాం..
ఒక సంధ్యలో.
ఎవరో ఒకరు ముందుకో వెనక్కో
ఒక  అడుగువేస్తేకాని తెలియదు
వచ్చేది  వెలుగో చీకటో.
ఆ క్షణం గడవటానికి  జీవితం పట్టొచ్చేమో..

No comments: