నాలో  ఎన్ని నేనులో?..
చలిలో వుక్కలో
వానలో వెన్నెల్లో
నిన్నలో నేటిలో
రాత్రిలో పగటిలో
వెలుగులో చీకటిలో
ఆకలిలో దాహంలో
సుఖంలో దుఃఖంలో
ఆశలో నిరాశలో
నలుగురిలో ఏకాంతంలో
మెలకువలో నిద్దురలో
కలలలో కలతల్లో
ఓటమిలో విజయంలో
ఆలోచనలో ఆచరణలో
కణకణంలో క్షణక్షణంలో
ఎన్ని నేనులో ...
అందరిని గెంటివేసి
నేనుమాత్రమే ఉండాలనుకుంటే
నేనుఎవరో నాకు తెలియడంలేదు  ....





No comments: