నీ నయన తటాక నిశ్చల జలమ్ములందు
నా నీడ చూసుకొను భాగ్యమ్ము లేదు  .. 

నా కొరకు విరియు కెంజాయ పెదవినడిమి 
మెరసి మాయమౌ ముత్యముల కను క్షణము రాదు.. 

నీ సుందర కృష్ణవేణీ ఝరుల 
మోము దాచి మైమరచు ఆశ లేదు ... 

నీ వియొగజనిత  వేదాంతము కరగిపోవ 
నీవేలాగునో మరలమరలివత్తువని 
మోక్షమ్ము పై నాకు ఆశ పోయి చెలీ 
నీకొరకు మరుజన్మ మెత్తవలెనున్నదే ...