ఏముంది నీలో?
దివ్యత్వమో ,అద్వైతమో ...
నువ్వు వున్నపుడు మాత్రమే
మెరిసే వెన్నెల నీకన్నా ఎక్కువ
ఎలా అవుతుంది చెప్పు ?
నీ పరోక్షంలో
అన్నిసంధ్యలూ తెల్లబోతాయి.
సృష్టిలోని సర్వ శబ్దాలు
నిశ్శబ్దాన్నే పలుకుతాయి.
ఎపుడో ఒక నీరవ యామినిలో
ఏదో ఒక పాట దూరాల నుండి
తేలివచ్చిమనసును తట్టిలేపుతుంది ...
దేహంలోని కణాలన్నీ
నీజ్ఞాపకాల వెల్లువలొ
ఈదులాడి అలసిపోతాయి.















No comments: