పంచేంద్రియాలకు అందని
ఒక అనుభూతి ...
వేలవేల నిద్రలేని రాత్రుల
చీకటిసముద్రతీరాన
ఆకలికి అలసటకి అతీతంగా
సేదతీర్చే ఔషధం... నీ జ్ఞాపకం.

చలిగాలిలో ఎండిన  ఆకుల్లా
ఆశలు రోజులతోపాటు రాలిపోతుంటే  ...
ఒక మధ్యాహ్నపు వేసవి ఎండలో
సర్వాన్నీ భస్మం చేయగల
ఒక కార్చిచ్చు కోసం ఎదురుచూస్తున్నా ...













No comments: