గుండెకి గోదావరికి
ఏదో లింకు ...
వెన్నెల్లో గోదావరి ...
వర్షంలో గోదావరి ..
వరద గోదావరి ...
ఇపుడు పుష్కర గోదారి ...
కాలప్రవాహంతో
చెట్టాపట్టాలేసుకొని ప్రవహించే
తనకి ప్రతి సందె ప్రత్యేకమే...
ప్రతిమలుపు సౌందర్యమే...
అప్పటి సీతా రాములనుంచి
ఇప్పటి సినిమా తారలదాకా
ఎన్నివేల పుష్కరాలు చూసిందో ...
అయినా తాను నిత్య యవ్వని.
తాను పాదం మోపిన తావెల్ల
జీవధార ప్రవహించే పరమ పావని.