జ్ఞాపకం ఎక్కడ నిదురపోతుంది?
గుండె గదుల్లొనా..
లేక, మెదడు పొరల్లొనా ?
ఆలోచనలకూ ధమనులు సిరల్లా
వేరువేరు ప్రవాహాలు ఉంటాయా ?
మారే ప్రతి ఋతువూ చెబుతూంది
మార్పుమాత్రమే సృష్టిలో
స్థిరమైన సత్యం అని.
మనసు ఎలా మారుతూంది
గండ శిలల్లా జ్ఞాపకాలు
ఘనీభవించి కూర్చుంటే ... ?
No comments:
Post a Comment