బాల్యం అంటే
అంతా అమ్మే.
ఎదిగాక  స్నేహితులను
వెంటేసుకు తిరుగుతూంటే
'అమ్మ జాగ్రత్తరా' అన్నపుడు
'నీకేమీ తెలీదమ్మా' అన్నాను.
వయసొచ్చి, పెళ్లయ్యి ...
వుద్యోగం, సంపాదన,
లక్ష్యాలు, ఆశయాలు ...
అమ్మ మళ్ళీ 'జాగ్రత్తరా' అన్నపుడు
'నీదంతా చాదస్తం' అన్నాను.
నా బిడ్డలతో నేను  'జాగ్రత్తమ్మా' అంటే
వాళ్ళు 'నీకేమి తెలియదు డాడీ'  అన్నపుడు...
అమ్మ నావంక నవ్వుతూ చూస్తోంది.