తీక్షణ నిశ్శబ్దపు ఎడారులివి ...
దొరకదు ఒక్క శబ్ద బిందువైన
మనసు తట్టి ఒంటరి సేదతీర్ప ...
గాలివాలున అది నీవెకాబొలు
నేల దిగిన వర్ష మేఘమ్మువోలె
మృదు స్నేహరాగమాలపించేవు ...
పరుగులిడుచున్నాను
పడిలేచి ఆవంక నీకొరకు...
గడిచే రేపవళ్లు లెక్కలేవు
తరగదెంతకు దూరము ...
డస్సిపోవుదు నిలిచి నడువలేక ...
ఆశ బంధించి మరల
మనసు మళ్ళిం చు నీవైపు...
మృగతృష్ణకాక మరియేమి నీవు ....