నాలో నేనే...
ఏమేమో అనుకున్నా...
వెన్నెల్లో ఆడుకున్నా...
వర్షంలో వెల్లువయ్యా...
వెన్నెలొచ్చి పోయింది.
వాన వెలిసి పోయింది.
ఎవరిని ఏమనాలి....?
దుఖం...ఉక్రోషం...
అసహాయత... నిర్వేదం.
నిర్వేదపు మైదానంలో
నిజం మొలిచి నిలిచింది...
నేను తప్ప లోకంలో
వేరేమీ లేదన్నది
నిజమే....
ఏమి చేసినా నాకోసమే.
ఆశలు వేల గొంతుకలతో అరుస్తున్నై..
నరాల సాలెగూటిలో నిరంతరం తపన...
నాకే అచ్చంగా అంతా కావాలని.
వద్దనుకోవాలంటే....
నన్ను నేనే వదిలేయాలి.