కాలుతూన్న జ్ఞాపకాల సెగతో
కమురు పట్టిన మనసు
బ్లాక్ బాక్స్ కాకుండా
బ్లాక్ హోల్ అయితే బాగుండు.
ఏడు రంగులూ కలిసి తెల్లబారినట్లు
ఆరు ఋతువులు గడిచి
ఏడో ఋతువుని చూస్తున్నా.
బంధం అలౌకికమైనా
ముగింపు లౌకికమే ..
ఈ నిశ్శబ్దం నిరంతర శరాపాతం ..
తడవటం తప్ప దారిలేదు ..
కమురు పట్టిన మనసు
బ్లాక్ బాక్స్ కాకుండా
బ్లాక్ హోల్ అయితే బాగుండు.
ఏడు రంగులూ కలిసి తెల్లబారినట్లు
ఆరు ఋతువులు గడిచి
ఏడో ఋతువుని చూస్తున్నా.
బంధం అలౌకికమైనా
ముగింపు లౌకికమే ..
ఈ నిశ్శబ్దం నిరంతర శరాపాతం ..
తడవటం తప్ప దారిలేదు ..