ఋతువుకి ..
మనసుకి ...
నీకు ...
సంబంధం లేకుండా
కవిత ఎలా పుడుతుంది ?

ప్రకృతి  ఏదో ఒక సంధ్యలో
సన్నగా నవ్వినపుడు
నువు గుర్తుకొస్తావు  ...

మనస్సు అంతరాల
జ్ఞాపకాల దొంతరల్లోంచి
పొగమంచులా ఏదో  భావం ...
చల్లగా .. భారంగా ..
చూట్టూ కమ్మేస్తుంది కాని
గుప్పెడు కూడా దొరకదు...