జనవాహిని లోంచి రైలు బండిలోకి ఎక్కుతూ
వెనక్కి తిరిగి చూస్తే నేనొక్కడినే ,
గమ్యం చేరాక రైలు దిగేటప్పుడు నేనొక్కడినే ,
జ్ఞాపకాల వీధుల చీకటి వెలుగుల్లో
సంచరిస్తూ నేనొక్కడినే ,
సంచరిస్తూ నేనొక్కడినే ,
వాన కురిసి గుబులు పుడితే,
వేడి ఎండలు సెగలు పెడితే,
ఆకలేస్తే,దాహమేస్తే ,పోద్దువాలి చీకటైతే ,
నిదుర రాక బెంగపడితే, అమ్మ కోసం తపన పడితే,
నేనొక్కడినే.....
ఆకలేస్తే,దాహమేస్తే ,పోద్దువాలి చీకటైతే ,
నిదుర రాక బెంగపడితే, అమ్మ కోసం తపన పడితే,
నేనొక్కడినే.....