తీగతెగిపోయాక
మ్రోగే నాదం
నిశ్శబ్దం....
ఈ నీరవసాగరంలో
నిలువెల్లా ముంచెత్తే
జ్ఞాపకాల అలలు ...
దూరానికి కాలానికి
మరే కొలమానానికి
ఇక్కడ వైనం దొరకదు...
గాలికూడా ఘనీభవించి
ఊపిరి బరువవుతుంది...
భావాలను అందుకోలేక
భాష చతికిలపడినప్పుదు
నాలోనేను ఒంటరినైపోతాను...