గంధం గొడ్డలి వేటుకే
పరిమళిస్తుంది..
శిల్పం ఉలి తాకిడికే
వన్నెలొలుకుతుంది..
బంగారమైనా అంతే కదూ
పుటంపెడితేనే మెరుస్తుంది..
ఒక్క గుండెని అన్నీ చేస్తే
ఎంత అద్భుతం ప్రభవిస్తుందో?..