భ-"జనం"

మెదడు లోన మట్టి పెరిగి 
తుప్పెక్కిన ప్రగతి పధం
మూఢ భావాలే ఆక్సిజెన్ గా
ఊపిరి పీలుస్తున్న జనం .
గుండె చప్పుళ్ళే "డబ్బు" గా 
జీవించే స్వార్ధ  జనం
వేరు కుళ్ళి చెట్టు చస్తే
చేతబడి అనే జనం.
పక్కింట్లో మనిషి పోతే 
నీడల్నిదయ్యమనే మూఢ జనం.
కన్నెదురే ఖూనీ జరిగితే 
మనకెందుకు పొమ్మనే జడపు జనం.